ఏపీ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 08/05/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి: చంద్రబాబు

విజయవాడ: దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇమ్మని కేంద్రం స్పష్టం చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం సాధ్యం కాదని చెప్పటం తగదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్‌ కోసం రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టకుండా కేంద్రం అనుమతులు లేవంటూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. ప్రభుత్వ సహకారం లేనిదే కరోనా నియంత్రణ సాధ్యం కాదని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ తమ గళం గట్టిగా వినిపించి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘కరోనా వేళ సమాజ శ్రేయస్సుకు అవసరమైన సమాచారం’ పేరిట ఆన్‌లైన్‌లో చంద్రబాబు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగాల నిపుణులు పాల్గొన్నారు.

సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ... కొవిడ్‌ నివారణకు స్వల్పకాలిక, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలేమిటనే అధ్యయనం ఈ సమావేశం ద్వారా జరగాలని చంద్రబాబు కోరారు. క్లిష్ట పరిస్థితుల్లో కలసికట్టుగా కరోనాను ఎలా ఎదుర్కోవాలో అంతా ఆలోచన చేయాలన్నారు. కొవిడ్‌పై పోరాటంలో సమష్టి కృషి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఎన్‌ఆర్‌ఐ వైద్యులు లోకేశ్వరరావు సాయంతో 200 మందికి పైగా వైద్య సాయం అందించామని.. పడకలు దొరక్క, ఆక్సిజన్‌ లభించని క్లిష్ట పరిస్థితుల్లో తోచిన సాయం అందించే విధంగా చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

అందరి సహకారంతో వివిధ రకాల సమస్యలను పరిష్కరించగలుగుతున్నామని తెలిపారు. ప్రజలకు ఉత్తమ విధానాలు అందించాలనే లక్ష్యంతోనే సమావేశం ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. కరోనా వైరస్‌ రెండో దశ 20ఏళ్లు పైబడిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడో దశలో చిన్నారులపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుగానే సమగ్ర ప్రణాళికలు చేపడితే భవిష్యత్తు ప్రమాదాలను నివారించగలమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని