APnews: ఆ వ్యక్తి దగ్గర కత్తి ఎందుకు?: బాబు

తాజా వార్తలు

Updated : 31/05/2021 18:51 IST

APnews: ఆ వ్యక్తి దగ్గర కత్తి ఎందుకు?: బాబు

అమరావతి: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కక్షపూరితంగా కేసులు పెట్టి జడ్జి రామకృష్ణను జైలులో పెట్టించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు అండగా నిలిస్తే కేసులు పెడతారా?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో తెదేపా ముఖ్యనేతలు ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. జడ్జి రామకృష్ణను హత్య చేసే ఉద్దేశంతోనే అతని బ్యారక్‌లోకి మరో వ్యక్తిని పంపించారని చంద్రబాబు ఆరోపించారు. ఆ అపరిచిత వ్యక్తి వద్ద కత్తి ఎందుకు ఉందో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై.. జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దాంతో జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌జైలుకు తరలించారు.

ఆనందయ్యకు రక్షణ ఇవ్వాలి
ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఉన్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్యను వెంటనే ఇంటికి పంపి తగిన రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ప్రకటనలకు ఖర్చు చేసే సొమ్మును వ్యాక్సిన్‌ కొనుగోలు కోసం వాడాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని