CBN: ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆస్తి: చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 28/05/2021 10:46 IST

CBN: ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆస్తి: చంద్రబాబు

హైదరాబాద్‌: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జీవితం ఈతరానికే కాకుండా భావితరాలకూ దిక్సూచి అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాన్ని సాధించేవరకు రాజీ పడకుండా ముందుకెళ్లిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆస్తి, వారసత్వమన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ శక్తిగా మారారని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి అవసరమైన పథకాలు రూపొందించారని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లు తదితర ఎన్నో పథకాలను దూరదృష్టితో ఆలోచించి తీసుకొచ్చారన్నారు. సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిపోతుందని చంద్రబాబు చెప్పారు.  అంతకుముందు ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు నివాళులర్పించారు.

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఈ ఉదయం చంద్రబాబు ట్వీట్ చేశారు. అధికారం అనుభవించడానికి కాదు.. ప్రజలకు సేవచేయడానికి అనే మానవీయ సిద్ధాంతాన్ని తొలిసారిగా రాజకీయాల్లోకి, పాలనలోకి తెచ్చి ఆచరించి చూపిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఆ విశ్వవిఖ్యాతుని ఆదర్శాలు, ఆశయాలను మననం చేసుకుంటూ.. ప్రజాసేవలో స్ఫూర్తిని పొందుదామని..తిరుగులేని ఆ ప్రజా నాయకుని స్మృతికి నివాళులర్పిద్దామని ట్వీట్‌లో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని