Ap news: దేవినేని కాన్వాయ్‌ను అడ్డుకోవడం హేయం: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 06/08/2021 01:51 IST

Ap news: దేవినేని కాన్వాయ్‌ను అడ్డుకోవడం హేయం: చంద్రబాబు

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం హేయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. హింసించి ఆనందించడం సీఎం జగన్‌కు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. జనం నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జాతీయరహదారిపై పోలీసులు ఏవిధంగా వాహనాలు ఆపుతారని చంద్రబాబు ప్రశ్నించారు. చట్టాన్ని అధికార పక్షం వాళ్లు చుట్టంలా మార్చుకున్నారని ఆరోపించారు.కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో దేవినేని ఉమాను అరెస్టుచేసి రాజమహేంద్రవరం జైలులో ఉంచిన విషయం తెలిసిందే. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ దేవినేని ఉమ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఇవాళ ఉదయం ఆయన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తెదేపా శ్రేణులు ఉమాకు ఘనస్వాగతం పలికాయి. రాజమహేంద్రవరం నుంచి ఉమా వెంట భారీ కాన్వాయ్‌తో బయల్దేరాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోకి రాగానే ఉమా కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రహదారికి అడ్డంగా లారీలు, ట్రక్కులు పెట్టి తెదేపా నేతలు, కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనాలను రోడ్డుపైనే నిలిపివేశారు. దేవినేని ఉమా ప్రయాణిస్తున్న ఒక్క కారును పంపి, వాహనశ్రేణిలోని మిగిలిన కార్లను పంపకపోవడంతో దేవినేని ఉమా, పట్టాభి ఇతర నేతలు అక్కడే నిరసనకు దిగారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని