వైఫల్యాలను ప్రశ్నిస్తే..దేశద్రోహం కేసా?: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 15/05/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైఫల్యాలను ప్రశ్నిస్తే..దేశద్రోహం కేసా?: చంద్రబాబు

అమరావతి: కరోనా వైఫల్యాలను ప్రశ్నించిన ఎంపీపై దేశద్రోహం కేసు వేస్తారా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. కరోనా విపత్కర సమయాల్లోనూ కక్ష సాధింపు చర్యలే ముఖ్యమా? అని ఆయన అన్నారు. జగన్‌ పాలనలో ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లే బహుమతా?అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పగ, ప్రతీకారానికి వాడటం దుర్మార్గమని,  కరోనా వేళ ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలని చంద్రబాబు హితవుపలికారు. ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ హైదరాబాద్‌లో ఆరెస్టు చేసిన విషయం తెలిసిందే. 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆయనపై అభియోగం మోపారు. ప్రస్తుతం ఆయన్ను మంగళగిరికి తరలిస్తున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని