close

తాజా వార్తలు

Updated : 01/03/2021 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రేణిగుంట నుంచి బయల్దేరిన చంద్రబాబు

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. సాయంత్రం 7.10 గంటలకు విమానంలో ఆయన బయల్దేరి హైదరాబాద్‌ వెళ్లారు. చంద్రబాబును విమానాశ్రయంలోనే అడ్డుకోవడంతో ఈ ఉదయం నుంచీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సుమారు 10 గంటలపాటు ఆయన నిరసన కొనసాగింది.

చిత్తూరు, తిరుపతిల్లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే కొవిడ్‌ పరిస్థితులు, ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ అక్కడి పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరికి నిరసనగా విమానాశ్రయంలో నేలపైనే బైఠాయించారు. ఆందోళన విరమించాలంటూ పలుమార్లు ఉన్నతాధికారులు  ఆయనతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. జరిగిన ఘటనపై చిత్తూరు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి వెళ్తానని.. ఎక్కడా ఎలాంటి నిరసన కార్యక్రమాలకు దిగబోనని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. మీడియాతో మాట్లాడేందుకూ అనుమతించకపోవడంతో చంద్రబాబు నిరసన కొనసాగించారు. మధ్యలో పలుమార్లు తిరుపతి అర్బన్‌ ఎస్పీ, జేసీ ఆయనతో చర్చలు జరిపారు. చివరికి ఆయన నిరసన విరమించి హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని