
తాజా వార్తలు
తిరుమలలో చంద్రబాబుకు ఘన స్వాగతం
తిరుమల: లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి చేరుకున్నారు. ఈఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళ్లారు. తిరుమల శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద తితిదే అధికారులు స్వాగతం పలికారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవులు, సంధ్యారాణి తదితరులు చంద్రబాబుతో పాటు ఉన్నారు. నేటి నుంచి ఈనెల 14 వరకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీకాళహస్తి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
Tags :