ధర్మయుద్ధంలో జగన్‌ గెలవలేరు : చింతా

తాజా వార్తలు

Published : 04/04/2021 12:07 IST

ధర్మయుద్ధంలో జగన్‌ గెలవలేరు : చింతా


అమరావతి: ధర్మయుద్ధంలో సీఎం జగన్‌ గెలవలేరని తిరుపతి లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌ అన్నారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే ఈసారి భాజపాకు కూడా పడుతుందని జోస్యం చెప్పారు. అధిక ధరలు భాజపా పతనానికి ప్రధాన హేతువని అన్నారు. మరోవైపు భాజపా తరఫున జనసేన అధ్యక్షుడు పవన్‌ చేస్తున్న ప్రచారం వల్ల ప్రయోజనమేమీ ఉండదని, అదంతా వృథా ప్రయాస అని అన్నారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా కుమార్తె ప్రశ్నలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ మీద కోపాన్ని ఆయన సోదరి షర్మిల తెలంగాణలో చూపిస్తున్నారని అన్నారు. ఆరు నెలల తర్వాత సీఎం జగన్‌ అధికారంలో ఉండరని అన్నారు. ప్రలోభాలు లేకుంటే కాంగ్రెస్‌కు మళ్లీ ఆదరణ వస్తుందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని