గొంతు నొక్కాలని చూస్తున్నారు: దేవినేని
close

తాజా వార్తలు

Updated : 30/04/2021 10:09 IST

గొంతు నొక్కాలని చూస్తున్నారు: దేవినేని

అమరావతి: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కేసులో సీఐడీ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ జరిగింది. సీఎం జగన్‌ మాటలను ట్యాబ్‌లో చూపిన అంశంపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ట్యాబ్‌, సంబంధిత ఆధారాలు కావాలని సీఐడీ అధికారులు కోరినట్లు సమాచారం. విచారణ ముగిసిన అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడారు.‘‘తప్పుడు కేసులతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. చంద్రబాబు పేరు చెప్పాలని సీఐడీ అధికారులు ఒత్తిడి చేశారు. ఆయన పేరు చెబితే నన్ను వదిలేస్తామన్నారు. మరోసారి విచారణకు రేపు, ఎల్లుండి హాజరుకావాలన్నారు’’ అని దేవినేని వ్యాఖ్యలు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని