దేవినేని ఉమాకు మరోసారి సీఐడీ నోటీసులు

తాజా వార్తలు

Updated : 30/04/2021 13:46 IST

దేవినేని ఉమాకు మరోసారి సీఐడీ నోటీసులు

విజయవాడ: మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌నేత దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ అభియోగాలపై సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులిచ్చారు. మే1 వ తేదీ ఉదయం 11గంటలకు మరోమారు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

గురువారం మంగళగిరి సీఐడీ కార్యాలయంలో 9గంటల పాటు దేవినేని ఉమాను అధికారులు విచారించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఉమాకు అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ప్రెస్‌మీట్‌లో ఉమా ఉపయోగించిన సెల్‌ఫోన్, ట్యాబ్‌లు ఎక్కడ అని అధికారులు అడిగారు. ఉమా ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని సీఐడీ అధికారులు మరోసారి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈనెల 7న దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మార్ఫింగ్‌ చేసిన జగన్‌ వీడియోలు ప్రదర్శించారని అభియోగం. ఈమేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని