ఇకపై కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు: భట్టి
close

తాజా వార్తలు

Published : 14/02/2021 01:37 IST

ఇకపై కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు: భట్టి

జగిత్యాల: తెలంగాణ గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రోడ్ల మీద పడి అరిచినంత మాత్రాన తెలంగాణ రాలేదని.. చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని వారు మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో తెరాసపై తనదైన శైలిలో భట్టి విమర్శలు చేశారు. తెలంగాణపై మాట్లాడే హక్కు కేవలం కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. నిత్యం అబద్ధాలాడుతూ ప్రజలను దోచుకుంటున్నారని.. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని భట్టి హెచ్చరించారు. 2024లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని భట్టి వెల్లడించారు.

ఇవీ చదవండి..

మదనపల్లెలో ఉద్రిక్తం.. నిలిచిన కౌంటింగ్‌

దాంపత్య జీవితానికి అడ్డు వస్తోందని...!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని