కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: భట్టి

తాజా వార్తలు

Updated : 26/08/2020 14:27 IST

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: భట్టి

భద్రాద్రి :  ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలు ఆసుపత్రుల బాట పట్టారు.  భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిని బుధవారం కాంగ్రెస్‌ శాసన సభాపక్షం(సీఎల్పీ)పరిశీలించింది. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నేతృత్వంలోని బృందం ఆసుపత్రికి చేరుకుని రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.  

కొవిడ్‌ రోగులకు చేస్తున్న పరీక్షలు, చికిత్సలకు సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యుగేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆసుపత్రుల్లో సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కానికి కృషి చేసేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు సీఎల్పీ బృందం స్పష్టం చేసింది. 11 రోజులపాటు జరిగే ఈ పర్యటన సెప్టెంబరు 5న హైదరాబాద్‌లోని ఆస్పత్రుల పరిశీలనతో ముగియనుంది. భద్రాచలం పర్యటన తర్వాత ఇవాళ ములుగు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను సీఎల్పీ బృందం పరిశీలించనుంది.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ... కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని