జలవివాదంపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

తాజా వార్తలు

Updated : 30/06/2021 15:20 IST

జలవివాదంపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్‌ సమావేశంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని.. వాళ్లని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే ఎక్కువగా మాట్లాడటం లేదన్నారు. అలాగని ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. నీటివివాదంపై తెలంగాణ మంత్రులు పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో అలోచించి ముందుకు వెళ్లాలని మంత్రులకు సీఎం సూచించారు. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ అనుమతి లేకుండా నీటిని వినియోగిస్తున్న విషయంలో మరోసారి కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని సీఎం ఆదేశించారు. అలాగే జలవివాదాలపై ప్రధానికి కూడా లేఖ రాయాలని మంత్రులను ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని