‘లబ్ధి చేకూర్చాం.. మా అభ్యర్థిని గెలిపించండి’
close

తాజా వార్తలు

Published : 08/04/2021 16:55 IST

‘లబ్ధి చేకూర్చాం.. మా అభ్యర్థిని గెలిపించండి’

తిరుపతి లోక్‌సభ పరిధిలోని ప్రజలకు సీఎం జగన్‌ లేఖలు

తిరుపతి: ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కుటుంబాలకు వైకాపా అధినేత, సీఎం జగన్‌ లేఖలు రాశారు. 22 నెలల పాలనా కాలంలో వైకాపా ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును ఈ లేఖలో వివరించారు. క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై జగన్‌ సంతకం చేశారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ పింఛన్‌ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలతో పాటు రైతులు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు తదితర అంశాలను జగన్‌ ఈ లేఖల్లో ప్రస్తావించారు. తిరుపతి ఉప ఎన్నికలో ఫ్యాన్‌ గుర్తుపై ఓటువేసి వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్‌ గురుమూర్తిని గెలిపించాలని ఆయా కుటుంబాలను సీఎం అభ్యర్థించారు. ఈ లేఖలను ఓటర్లకు వైకాపా నేతలు అందజేయనున్నారు. లేఖల్లో ప్రతిపక్ష పార్టీల మీద ఎలాంటి విమర్శలు చేయకుండా.. తమ 22 నెలల పరిపాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వ దార్శనికత, నిలబెట్టుకున్న వాగ్దానాలు.. దానికి సంబంధించిన విధానాన్నే ప్రజలకు తెలియజేస్తున్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని