విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మోదీకి సీఎం లేఖ

తాజా వార్తలు

Updated : 07/02/2021 12:23 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మోదీకి సీఎం లేఖ

అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ద్వారా 20 వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నట్టు లేఖలో సీఎం పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరారు. ‘విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఈ ఫ్యాక్టరీ వచ్చిందని వివరించారు. దశాబ్దం పాటు ప్రజలు పోరాటం చేశారని, నాటి ఉద్యమంలో 32మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. 2002-15 మధ్య వైజాగ్‌ స్టీల్‌ మంచి పనితీరు కనపరిచిందన్నారు. ఈ ప్లాంటు పరిధిలో 19,700 ఎకరాల భూములు ఉన్నాయని.. వాటి విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందని వివరించారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరగడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయని చెప్పారు. స్టీల్‌ ప్లాంటుకు సొంతంగా గనుల్లేవని సీఎం ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

గతేడాది రూ.200 కోట్ల లాభాలొచ్చాయ్‌..

‘‘కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడటం ద్వారా ప్లాంట్‌ను ప్రగతిబాటలో తీసుకెళ్లొచ్చు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 7.3మిలియన్‌ టన్నులు. 6.3మిలియన్‌ టన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తున్నాం. డిసెంబర్‌ 2020లో రూ.200 కోట్ల మేర లాభం కూడా వచ్చింది. వచ్చే రెండేళ్లలో ఇలాగే కొనసాగితే ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది’’ అన్నారు. 

విశాఖ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించండి..
బైలదిల్లా నుంచి ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోంది. దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ.5,260 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఫలితంగా టన్నుకు అదనంగా రూ.3,472లు భారం పడుతోంది. సెయిల్‌కు సొంతంగా గనులు ఉన్నాయి. దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌ వద్ద ఉన్నాయి. వైజాగ్‌ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. గనులు కేటాయింపుతో పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి ప్లాంటును తీసుకెళ్లొచ్చు. బ్యాంకుల రుణాలను వాటా రూపంలోకి మార్చితే ఊరట కలుగుతుంది.  వడ్డీరేట్లు కూడా తగ్గిస్తే ప్లాంటుపై భారం తగ్గుతుంది. స్టాక్స్‌ను ప్రజలు అందుబాటులోకి తెచ్చే అవకాశాలను పరిశీలించాలి’’ అని సీఎం కోరారు.

ఇదీ చదవండి..

 

ఉద్యమాల ఉక్కుకు... ఇప్పుడెవరయ్యా దిక్కు?



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని