ప్రగతి భవన్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌
close

తాజా వార్తలు

Published : 06/05/2021 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రగతి భవన్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీన నాగార్జున సాగర్ బహిరంగసభలో పాల్గొన్న తర్వాత ఒకటి, రెండు రోజులకు సీఎం ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. స్వల్పలక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా.. 19న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు అప్పటినుంచి సీఎం ఐసోలేషన్‌లో ఉన్నారు. మధ్యలో ఒకసారి పరీక్షల నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చినప్పటికీ ప్రగతిభవన్‌కు వెళ్లలేదు.

చికిత్స అనంతరం ఈ నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో సీఎం ఇవాళ ఎర్రవల్లి నుంచి ప్రగతిభవన్‌కు వచ్చారు. దాదాపు 20 రోజుల తర్వాత కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ కూడా అదనంగా సీఎంకు చేరింది. దీంతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, చికిత్స, టీకాల కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని