భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

తాజా వార్తలు

Published : 15/10/2020 10:25 IST

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం 3గంటల పాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. 

పురపాలక, వ్యవసాయ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖల మంత్రులు కేటీ రామారావు, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, హైదరాబాద్‌ నగరానికి చెందిన మంత్రులు శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఆయా శాఖల కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ కలెక్టర్లను సమావేశానికి ఆహ్వానించారు.వర్షాల వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకురావాలని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని