సాగర్‌ ప్రజలు వారి విశ్వాసాన్ని ప్రకటించారు: కేసీఆర్‌

తాజా వార్తలు

Published : 02/05/2021 17:29 IST

సాగర్‌ ప్రజలు వారి విశ్వాసాన్ని ప్రకటించారు: కేసీఆర్‌

హైదరాబాద్: ఎవరు ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెరాస అభ్యర్థి నోముల భగత్‌ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించినందుకు సీఎం కేసీఆర్ కృతజ్జతలు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్‌ను కలుస్తానని.. అలాగే నాగార్జున సాగర్ నియోజక వర్గాన్ని సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. 

దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో ఇటీవల మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు సేకరించిన ప్రజా సమస్యన్నింటినీ సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజయం సాధించిన అభ్యర్థి నోముల భగత్‌ను సీఎం ఈ సందర్భంగా అభినందించారు. చక్కగా ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని నోముల భగత్‌కు సీఎం సూచించారు. భగత్‌ విజయం కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని