బెంగాల్లో వామపక్షాలతో పొత్తుకు సై: కాంగ్రెస్‌

తాజా వార్తలు

Published : 25/12/2020 02:01 IST

బెంగాల్లో వామపక్షాలతో పొత్తుకు సై: కాంగ్రెస్‌

దిల్లీ: కేరళలో అధికార వామపక్ష పార్టీలతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్న కాంగ్రెస్‌.. బెంగాల్‌లో మాత్రం ఆ పార్టీలతో పొత్తుపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు బెంగాల్‌ కాంగ్రెస్‌ యూనిట్‌ చీఫ్‌ అధిర్‌ రంజన్‌ చౌదరీ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం అంగీకారం తెలిపింది’ అని వెల్లడించారు. ఇప్పటికే రానున్న బెంగాల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు వామపక్ష పార్టీలు సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ఆ పార్టీలతో పొత్తు గురించి అధిష్ఠానానికి లేఖ రాసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం గమనార్హం. కాగా బెంగాల్‌లో ఇటీవల టీఎంసీకి చెందిన కీలక నేత సువేందు అధికారి భాజపాలో చేరడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి

పొరపాటున తప్పు చేసుంటే క్షమించండి:జగన్


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని