కాంగ్రెస్‌ చరిత్ర సృష్టించబోతోంది: జానారెడ్డి
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 15:48 IST

కాంగ్రెస్‌ చరిత్ర సృష్టించబోతోంది: జానారెడ్డి

హాలియా: నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించబోతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సాగర్‌ అభ్యర్థి జానారెడ్డి అన్నారు. సరికొత్త రాజకీయ ఒరవడి కోసం ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. నల్గొండ జిల్లా హాలియాలో జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ ఆగడాలతో కొందరికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. గతంలో ఎన్నడూ చూడని సంఘటనలు, దాడులు చూస్తున్నట్లు చెప్పారు. తెరాస అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేస్తున్న తెరాస.. నీచమైన దిగజారుడు రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. ఎవరు వాస్తవాలు చెబుతున్నారో ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే పోడు భూములకు పట్టాలు ఇచ్చామని జానారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీని చావు నోట్లో పెట్టి తెలంగాణను సాధించుకున్నామని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని