రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారు: భట్టి
close

తాజా వార్తలు

Published : 25/06/2021 17:30 IST

రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారు: భట్టి

హైదరాబాద్‌: ప్రాజెక్టుల విషయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..రాజకీయ లబ్ధి పొందాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసమే ఏడాదిపాటు ఆగి ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన రోజే వ్యతిరేకించేవారని ధ్వజమెత్తారు. ఏడాది వరకు ఎందుకు ఆగి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. 

తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమైతే.. ఆ ప్రయోజనాలేవీ నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం దగ్గర డీప్‌కట్‌లో ప్రాజెక్టు కడుతున్నారని, అది పూర్తయితే రోజుకు 11 టీఎంసీల నీరు తరలిపోతుందని ఆరోపించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం నిండదని, అది నిండకపోతే నాగార్జున సాగర్‌కు నీళ్లు రావని, అది పూర్తిగా ఎండిపోతుందన్న  విషయాన్ని కూడా తామే చెప్పామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలే అరిచి గీపెట్టి పోరాటం చేశాయని పేర్కొన్నారు. కేసీఆర్‌కు విషయం తెలియక కాదు.. ఆయనకు తెలంగాణ ప్రయోజనాలకంటే,  ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భట్టి విక్రమార్క ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని