జగన్‌.. మోదీని ఎందుకు ప్రశ్నించరు?
close

తాజా వార్తలు

Updated : 04/06/2021 19:00 IST

జగన్‌.. మోదీని ఎందుకు ప్రశ్నించరు?

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ బాధ్యతను కేంద్రమే తీసుకునేలా అందరం ఒకే స్వరం వినిపించాలంటూ ఏపీ సీఎం జగన్‌ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయా రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ జైరాం రమేష్‌ పలు ప్రశ్నలు సంధించారు. టీకాల సరఫరా అంశంపై ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. జగన్‌ లేఖలు రాసినట్లుగా వచ్చిన వార్త లింక్‌ను పోస్ట్‌చేస్తూ ట్విటర్‌లో కొన్ని ప్రశ్నలు సంధించారు.

‘‘టీకా సమస్యను యూనియన్ వర్సెస్ స్టేట్స్ ఎవరు చేశారు? 18-44 సంవత్సరాల పిల్లలకు టీకాలు వేయడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకుంటుందని ఏకపక్షంగా ఎవరు నిర్ణయించారు? ఈ విధానాన్ని రూపొందించడానికి ముందు రాష్ట్రాలను ఎందుకు సంప్రదించ లేదు? ఈ ప్రశ్నలను మీరు ప్రధానిని ఎందుకు అడగకూడదు?’’ అంటూ జైరాం రమేష్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు. అంతకుముందు సీఎంలకు రాసిన లేఖలో వ్యాక్సిన్ల గురించి ప్రస్తావిస్తూ.. అందరికీ ఉచితంగా కొవిడ్‌ టీకా అందించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్‌ టెండర్లు పిలిచామన్నారు. అయితే గడువు ముగిసినా స్పందన లేదని పేర్కొన్నారు. వాటికి ఆమోదం తెలిపే అధికారం కేంద్రం వద్దనే ఉండటంతో.. ఈ అంశం కేంద్ర, రాష్ట్రాల మధ్య వ్యవహారంగా మారిపోయిందని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని