కేటీఆర్‌ను కలిస్తే తెరాసలో చేరినట్లా?: కౌశిక్‌రెడ్డి
close

తాజా వార్తలు

Published : 13/06/2021 01:10 IST

కేటీఆర్‌ను కలిస్తే తెరాసలో చేరినట్లా?: కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి

హైదరాబాద్‌: తెరాస తనను ఆహ్వానించిందనటం అవాస్తవమని హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి తెలిపారు. తెరాసలోకి వెళ్లనని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచే పోటీ చేశానని, ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తానని తెలిపారు. కేటీఆర్‌ను కలిసినంత మాత్రాన తెరాసలోకి వెళ్లనని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌దే విజయమని కేటీఆర్‌తోనూ చెప్పానని అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ టికెట్‌ తనకే వస్తుందని ఆశిస్తున్నట్టు కౌశిక్‌రెడ్డి తెలిపారు.  తెరాస గురించి ఈటల రెండేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి తెరాస ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల రాజేందర్‌ శాసనసభ సభ్యత్వానికి, తెరాసకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్‌లో ఈటలకు దీటుగా బలమైన అభ్యర్థి కోసం తెరాస అన్వేషిస్తున్న సమయంలో ఇటీవల కేటీఆర్‌ను కౌశిక్‌రెడ్డి కలవడం చర్చనీయాంశమైంది. కౌశిక్‌ తెరాసలో చేరుతారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి తన అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని