TS News: క‌రోనా మ‌ర‌ణాల‌కు కేసీఆరే కార‌ణం: భ‌ట్టి

తాజా వార్తలు

Updated : 07/06/2021 14:16 IST

TS News: క‌రోనా మ‌ర‌ణాల‌కు కేసీఆరే కార‌ణం: భ‌ట్టి

హైద‌రాబాద్‌: క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మండిప‌డ్డారు. రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల‌కు సీఎం కేసీఆరే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన స‌త్యాగ్ర‌హ దీక్ష‌లో భాగంగా గాంధీభ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎంపీ కోమ‌టిరెడ్డి మాట్లాడారు. క‌రోనా బాధితుల‌కు ఉచిత వైద్యం, ఆర్థిక సాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా చికిత్స‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చ‌లేద‌ని భ‌ట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చుతామ‌ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్ర‌క‌టించార‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి గుర్తుచేశారు. తొమ్మిది నెల‌లు అవుతున్నా ఆ హామీని అమ‌లు చేయ‌లేద‌ని ఆక్షేపించారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం, నేత‌ల‌ను కొనుగోలు చేయడంపైనే కేసీఆర్ దృష్టి ఉందని ఆరోపించారు. కొవిడ్‌తో ఎంతోమంది చనిపోతున్నా సీఎంకు పట్టడం లేదని విమ‌ర్శించారు. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టులు త‌దిత‌రాల‌పై రూ.వేల కోట్లు వెచ్చించ‌కుండా ప్ర‌జారోగ్యానికి అధిక నిధులు కేటాయించాల‌ని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని