Ts News: డీజీపీని కలిసిన కాంగ్రెస్‌ నేతలు
close

తాజా వార్తలు

Published : 23/06/2021 21:14 IST

Ts News: డీజీపీని కలిసిన కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్: యాదాద్రి భూవనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో విచారణలో ఉన్న మరియమ్మ మృతికి కారణమైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ప్రీతమ్‌లు డీజీపీ మహేందర్‌ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. మరియమ్మ కస్టోడియల్‌ డెత్‌ విషయంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తే సరిపోదని.. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు. మరియమ్మ కుటుంబానికి రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియాతోపాటు ఇల్లు, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై త్వరలో రాష్టపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసి వినతి పత్రం అందిస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని