‘సునీల్‌ మృతికి కేసీఆర్‌ బాధ్యత వహించాలి’

తాజా వార్తలు

Published : 02/04/2021 17:58 IST

‘సునీల్‌ మృతికి కేసీఆర్‌ బాధ్యత వహించాలి’

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్

హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వం తీరుతో యువత నిరుత్సాహానికి గురైందనడానికి నిరుద్యోగి సునీల్‌ నాయక్‌ ఆత్మహత్యే నిదర్శనమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యోగావకాశాల కోసం యువత పోరాడిందని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బిశ్వాల్‌ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. టీఎస్‌పీఎస్సీని ఒక్కరితో నడపడం ప్రభుత్వం తీరుకు నిదర్శనమన్నారు.

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడం యువతకు గొడ్డలి పెట్టు అని జీవన్‌రెడ్డి ఆక్షేపించారు. పదవీ విరమణ ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు అందివ్వాల్సి వస్తుందనే వయసును పెంచారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. సునీల్‌ నాయక్‌ మృతికి సీఎం కేసీఆర్‌ నైతిక బాధ్యత వహించాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గిరిజనులపట్ల సీఎం వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సునీల్‌ ఆత్మహత్యను జాతీయ మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని