దయనీయంగా ప్రైవేటు టీచర్ల పరిస్థితి: జీవన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Updated : 14/04/2021 14:54 IST

దయనీయంగా ప్రైవేటు టీచర్ల పరిస్థితి: జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటుతో సామాజిక న్యాయం జరుగుతుందని అందరూ భావించినా.. దురదృష్టవశాత్తు అందుకు భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయనుకున్నా.. ప్రస్తుతం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తలెత్తాయన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు టీచర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్న జీవన్‌రెడ్డి.. ప్రైవేటు టీచర్లకు రూ.2 వేల సాయం సరిపోదన్నారు. కనీసం రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతికి అతీగతీ లేకుండా పోయిందన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించడంతో వారంతా రోడ్డుపై పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని