పొమ్మనలేక పొగబెడుతున్నారు: వీహెచ్‌
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 18:04 IST

పొమ్మనలేక పొగబెడుతున్నారు: వీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విధేయులకు విలువ.. ఆత్మగౌరవం ఉందా? లేదా? అని కాంగ్రెస్‌ సీనియర్‌ వి.హనుమంతరావు .. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ను ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తామంటే అది మాకు అవమానం కాదా? అని నిలదీశారు. 

పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినా ఆయన అదృష్టం బాగుండి తిరిగి కొనసాగుతున్నారన్నారు. కర్ణాటకలో కొత్త పీసీసీ కోసం పరిశీలకుడిని పంపించారని, పంజాబ్‌లో కూడా అదే జరుగుతోందని.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మాణికం ఠాగూర్‌ ఒక్కరే అభిప్రాయ సేకరణ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో తనను పొమ్మనలేక పొగబెట్టి పంపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అధిష్ఠానానికి లేఖలు రాస్తే తప్పుబడుతున్నారని... 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా జరగలేదని వీహెచ్‌ ధ్వజమెత్తారు. పీసీసీ అధ్యక్ష పదవిని పార్టీ విధేయులకు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం తప్పా అని ప్రశ్నించారు. బయటి వాళ్లను అందలం ఎక్కించే ముందు వారి ట్రాక్‌ రికార్డు కూడా పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ఇన్‌ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి చేశారో మాణికం ఠాగూర్‌ చెప్పాలని వీహెచ్‌ నిలదీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని