రఘురామ వ్యాఖ్యల వెనక కుట్ర: సజ్జల
close

తాజా వార్తలు

Published : 19/05/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రఘురామ వ్యాఖ్యల వెనక కుట్ర: సజ్జల

అమరావతి: ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  రఘురామను తెదేపా పావుగా వాడుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తోందని ఆరోపించారు. రఘురామపై సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేసిందన్నారు. ఆయన విషయంలో ఎక్కడా ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రత్యర్థులపై రాజద్రోహం కేసు పెట్టడం తానెప్పుడూ చూడలేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారని చెబుతూ.. ఆయన హయాంలో కేసీఆర్‌పై 12 రాజద్రోహం కేసులు పెట్టారని సజ్జల గుర్తు చేశారు. బడ్జెట్‌ ఆమోదానికి శాసనసభను తప్పక సమావేశపరచాలని సజ్జల అభిప్రాయపడ్డారు. ఏమీ మాట్లాడలేకే అసెంబ్లీ సమావేశాలను తెదేపా బహిష్కరించిందన్నారు. శాసనసభ సమావేశాలకు వస్తే ప్రతిపక్షానికి ప్రజల్లో గౌరవం ఉంటుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని