Politics: గాంధీభవన్‌లో దళిత ఆవేదన దీక్ష

తాజా వార్తలు

Updated : 26/06/2021 15:42 IST

Politics: గాంధీభవన్‌లో దళిత ఆవేదన దీక్ష

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు మోసానికి గురవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురులో పోలీసు కస్టడీలో మరియమ్మ అనే ఎస్సీ మహిళ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘దళిత ఆవేదన దీక్ష’ పేరుతో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు కార్యక్రమం నిర్వహించారు. తాజా ఘటనతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు ఆవేదన చెందుతున్నారని దాసోజు శ్రవణ్‌ అన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు  116 ఎస్సీ, ఎస్టీల హత్యలు జరిగాయని, దాదాపు 6 వేల అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారందరికీ న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం ఎస్సీలను అణచివేస్తోందని ఆరోపించారు. నేరెళ్ల బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. మరియమ్మ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని.. లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎస్సీల జీవితాలు, వాకి హక్కులే ముఖ్యమన్నారు. రాష్ట్రంలోని ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని