కొవిడ్‌ మరణాలు: నిజాలను దాస్తున్నారు..!

తాజా వార్తలు

Updated : 26/04/2021 01:21 IST

కొవిడ్‌ మరణాలు: నిజాలను దాస్తున్నారు..!

తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మరి గురించి నిజాలను దాచిపెడుతుండడంతో పాటు మరణాల సంఖ్యను తక్కువగా నివేదిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ‘వాస్తవాలకు ముసుగు తొడగండి, ఆక్సిజన్‌ కొరతను కొట్టిపారేయండి, మరణాల సంఖ్యను తక్కువగా నివేదించండి.. ఇలా తప్పుడు ఇమేజ్‌ను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాల ప్రయత్నాలు చేస్తోంది’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు.

‘భారత్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోన్న వేళ.. వాస్తవ మరణాల సంఖ్యను తక్కువగా నివేదిస్తోంది’ అంటూ అమెరికాకు చెందిన ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ మొదటిపేజీలో ప్రచురించిన వార్తను రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పోస్టు చేశారు. కరోనా వైరస్‌ సేకండ్‌వేవ్‌ దేశాన్ని తుపానులా వణికించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘మన్‌ కి బాత్‌’లో చేసిన ప్రసంగంపైనా రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యవస్థ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ఇక కరోనా వైరస్‌కు సంబంధించిన కేసులు, మరణాల సమాచారాన్ని దాచిపెట్టడం దేశానికి అపచారం చేసినట్లేనని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ సమాచారం ఎంత తీవ్రతదైనా.. అవగాహన, అప్రమత్తం చేయడంతోపాటు జరిగిన తప్పును దిద్దుబాటు చేసుకోవడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తూనే ఉంది. నిన్న ఒక్కరోజే దేశంలో 3లక్షల 49వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 2767 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఒకేరోజు వ్యవధిలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు భారత్‌లో కరోనా మరణాల సంఖ్య లక్షా 92వేలు దాటింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని