వైకాపా గుర్తింపు రద్దు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

తాజా వార్తలు

Published : 07/04/2021 17:30 IST

వైకాపా గుర్తింపు రద్దు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

దిల్లీ: వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్‌ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ.. వైఎస్సార్‌ పేరును వాడకుండా చూడాలని ‘అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌’ అధ్యక్షుడు మహబూబ్‌ బాషా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు ముగించిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈనెల 17న తీర్పు వెలువరిస్తామని వెల్లడించింది. వైఎస్సార్‌ పేరును వినియోగించుకునేందుకు తమకు హక్కు ఉందంటూ వైకాపా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వైఎస్సార్‌ అనే పదాన్ని ఎన్నికల సంఘం తొలుత తమ పార్టీకి కేటాయించిందని అన్న వైఎస్సార్‌ పార్టీ తరఫు న్యాయవాది వాదించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని