‘సాంకేతిక పొరపాటని చెప్పడం సిగ్గుచేటు’

తాజా వార్తలు

Published : 15/08/2020 02:09 IST

‘సాంకేతిక పొరపాటని చెప్పడం సిగ్గుచేటు’

తెదేపా నేత దేవినేని ఉమ

విజయవాడ: జులై 30న ప్రభుత్వ ఖజానా నుంచి అదనపు చెల్లింపులు జరిగాయని తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ప్రభుత్వ చెల్లింపులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎఫ్‌ఎంఎస్‌ మాత్రం రూ. 649కోట్లు చెల్లింపులు జరిగాయని చెబుతోందని, అదనపు చెల్లింపులు సాంకేతిక పొరపాటని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. పొరపాటుకు ఎవరు బాధ్యత వహిస్తారో సీఎం, ఆర్థిక మంత్రి చెప్పాలని దేవినేని డిమాండ్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని