సీఐడీ విచారణకు హాజరైన దేవినేని ఉమా

తాజా వార్తలు

Updated : 29/04/2021 12:13 IST

సీఐడీ విచారణకు హాజరైన దేవినేని ఉమా

విజయవాడ: సీఎం జగన్‌ మాటల మార్ఫింగ్‌ వీడియో కేసులో తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీ విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించి, దుష్ప్రచారం చేశారనే ఆరోపణతో వైకాపా లీగల్‌ సెల్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్‌.నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దేవినేని ఉమా మహేశ్వరరావుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

వైకాపా సర్కార్‌కు మానవత్వంలేదు..

సీఎం జగన్‌ మాటలను మార్ఫింగ్‌ చేశారనే ఆరోపణలపై తనపై తప్పుడు కేసులు బనాయించారని దేవినేని అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అక్రమ కేసులపై కోర్టుల్లో పోరాడతానని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు. కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోని సీఎం.. పాలనను గాలికొదిలేశారంటూ దేవినేని దుయ్యబట్టారు. ‘‘ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోవడంలేదు. వైకాపా ప్రభుత్వానికి మానవత్వంలేదు. తప్పుడు కేసులు పెట్టి నా గొంతు నొక్కలేరు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ విచారణకు హాజరయ్యా. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది. నన్ను జైలులో పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటా. కరోనా సమయంలో విచారణకు హాజరుకావాల్సి వస్తోంది. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటి? అమూల్‌ కోసం సంగం డెయిరీ ఆస్తులను తాకట్టు పెట్టాలనే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వ మెప్పు కోసం కొందరు అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు’’ అని మండిపడ్డారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని