శశిథరూర్‌పై అనర్హత వేటు వేయండి 

తాజా వార్తలు

Published : 26/05/2021 01:10 IST

శశిథరూర్‌పై అనర్హత వేటు వేయండి 

స్పీకర్‌కు లేఖ రాసిన భాజపా ఎంపీ

దిల్లీ: దేశంలో విజృంభిస్తోన్న బి.1.627 కరోనా రకంపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనపై అనర్హత వేటు వేయాలని భాజపా ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు ఆయన లేఖ రాశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థే బి.1.617 రకం అని చెబుతుంటే.. దౌత్యపరంగా ఎంతో అనుభవం ఉన్న ఎంపీ శశిథరూర్‌ మాత్రం ‘భారత వేరియంట్‌’గా పిలుస్తున్నారని దుబే ఆరోపించారు.  

‘‘కరోనా రకంపై ఎంపీ అశాస్త్రీయ పదజాలం ప్రయోగిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు భారతీయులను అవమానించేలా ఉన్నాయి. ఆ పదాన్ని(భారత వేరియంట్‌ను ఉద్దేశిస్తూ) తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని సోషల్‌మీడియా సంస్థలకు లేఖ రాసింది. అయినప్పటికీ ఒక లోక్‌సభ సభ్యుడు ఆ పదాన్ని ఉపయోగిస్తుండటం దేశానికి, దేశ ప్రజలకు సిగ్గుచేటు’’అని దుబే లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులను పార్లమెంట్‌ సభ్యులుగా కొనసాగించడం, పార్లమెంటరీ కమిటీలకు ఛైరపర్సన్‌గా ఉంచడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన ఆరోపించారు. ఆయనపై వెంటనే అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని