పెట్రోల్‌ ధర తగ్గింపు.. వంటగ్యాస్‌పై రాయితీ

తాజా వార్తలు

Updated : 13/03/2021 14:39 IST

పెట్రోల్‌ ధర తగ్గింపు.. వంటగ్యాస్‌పై రాయితీ

డీఎంకే హామీల వర్షం

చెన్నై: తాము అధికారంలో వస్తే చమురు ధరలను తగ్గిస్తామని తమిళనాట ప్రతిపక్ష డీఎంకే హామీ ఇచ్చింది. శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ శనివారం విడుదల చేశారు. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యం కల్పించినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తే లీటర్‌ పెట్రోల్‌పై రూ.5 డీజిల్‌పై రూ.4 తగ్గిస్తామని స్టాలిన్‌ హామీ ఇచ్చారు. వంటగ్యాస్‌ సిలిండర్‌పై రాయితీ ఇస్తామని, మహిళలకు 12 నెలల ప్రసూతి సెలవులు కల్పిస్తామన్నారు. 

డీఎంఎకే మేనిఫెస్టోలో ప్రధానాంశాలు..

* అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు

* ఆస్తి పన్ను పెంపు రద్దు

* పరిశ్రమలో స్థానికులకు 75శాతం ఉద్యోగావకాశాలు

* లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4 తగ్గిస్తాం

* మహిళలకు ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు

* వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 రాయితీ 

* ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు

* తమిళనాడు వ్యాప్తంగా కలైంజ్ఞర్‌ క్యాంటీన్లు

* ఆవిన్‌ పాల ధర లీటర్‌పై రూ.3 తగ్గిస్తాం

* కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు రూ.4వేల సాయం

* జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు

* నీట్‌ పరీక్షల రద్దుకు శాసనసభ తొలి సమావేశంలో ఆర్డినెన్స్‌

* శాసనసభ సమావేశాలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం

* మధ్యాహ్న భోజన సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు

తమిళనాడులో 2011 నుంచి అధికారానికి దూరంగా ఉంటోన్న డీఎంకే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కాంగ్రెస్‌, వాపక్షాలు, ఎండీఎంకే, వీసీకే వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని గట్టిగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా.. సీట్ల సర్దుబాటులో భాగంగా డీఎంకే 173 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఈ ఎన్నికల్లోనే స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి అరంగేట్రం చేస్తున్నారు. డీఎంకే కంచుకోటలా భావించే చెపాక్‌ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని