డీఎంకే కూటమిలో ఎప్పుడైనా చీలిక: మురుగన్‌
close

తాజా వార్తలు

Published : 07/03/2021 01:16 IST

డీఎంకే కూటమిలో ఎప్పుడైనా చీలిక: మురుగన్‌

చెన్నై: డీఎంకే- కాంగ్రెస్‌ కూటమిలో ఎప్పుడైనా చీలిక రావొచ్చని తమిళనాడు భాజపా అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ భాగస్వామ్య పార్టీలను గౌరవించడంలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు కేటాయించినందుకు కాంగ్రెస్‌ శిబిరం అసంతృప్తితో ఉండటంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. శనివారం తిరువణ్ణామలైలో భాజపా చేపట్టిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా విలేకర్లతో ఆయన మాట్లాడారు. అన్నాడీఎంకే తమకు కేటాయించిన 20 స్థానాల్లో విజయంతో పాటు కూటమిని గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 

తమిళనాడులో డీఎంకే చీకటి పాలనకు మళ్లీ అవకాశం ఇవ్వమన్నారు. పొత్తులో భాగంగా అన్నాడీఎంకే తమకు 20 సీట్లు ఇచ్చినట్టు చెప్పారు. ఏయే స్థానాలనుంచి పోటీ చేయాలనే అంశంపై తదుపరి చర్చల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ క్రమంగా పుంజుకుంటుందని మురుగన్‌ వ్యాఖ్యానించారు. డీఎంకే హయాంలో భూ అక్రమాలు, కంగారూ కోర్టులు, ఇతర కుంభకోణాలు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. తమిళ ప్రజలకు సంస్కృతికి వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేస్తోందంటూ ధ్వజమెత్తారు. శ్రీలంకలో తమిళ ప్రజల్ని చంపినా మౌనప్రేక్షకుల్లా చూస్తు ఉండిపోయారని ఆరోపించారు. తమిళ ప్రజల  అభ్యున్నతికి డీఎంకే చేసిందేమీ లేదన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని