TS News: దిల్లీకి ప‌య‌న‌మైన ఈట‌ల రాజేంద‌ర్‌

తాజా వార్తలు

Updated : 30/05/2021 18:05 IST

TS News: దిల్లీకి ప‌య‌న‌మైన ఈట‌ల రాజేంద‌ర్‌

హైద‌రాబాద్‌: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ దిల్లీ బ‌య‌లుదేరారు. ఇటీవ‌ల ఆయ‌న భాజ‌పాలో చేర‌తార‌నే ఊహాగానాలు వినిపించిన నేప‌థ్యంలో ఈ ప‌ర్య‌ట‌న‌ ప్రాధాన్యం సంత‌రించుకుంది. భాజ‌పా జాతీయ‌ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆధ్వ‌ర్యంలో ఆయ‌న ఆ పార్టీలో చేర‌తార‌ని స‌మాచారం. రాజేంద‌ర్ ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు దిల్లీ చేరుకోనున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న‌ రేపు ఉద‌యం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, భాజ‌పా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంతోష్‌ల‌ను క‌లిసే అవ‌కాశం ఉంది.

ఈట‌ల దిల్లీ ప్ర‌యాణంతో తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. భూ ఆక్ర‌మ‌ణ‌ల ఆరోప‌ణ‌ల‌తో మంత్రి ప‌దవి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయిన ఈట‌ల దాదాపు అన్ని పార్టీల నాయ‌కుల‌తో ఇటీవ‌ల చ‌ర్చ‌లు జ‌రిపారు. చివ‌ర‌కు భాజ‌పాలో చేర‌తార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని