జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలి: చింతా మోహన్‌

తాజా వార్తలు

Published : 29/04/2021 14:14 IST

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలి: చింతా మోహన్‌

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. ఆయన బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని ఆరోపించారు. తిరుపతిలో చింతామోహన్‌ మీడియాతో మాట్లాడుతూ.. సహ నిందితులైన అధికారులకు పోస్టింగ్‌ ఇచ్చారని,  సాక్షులను జగన్‌ ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. రూ.లక్ష లంచం కేసులో బంగారు లక్ష్మణ్‌ను జైలుకు పంపినవిషయాన్ని గుర్తు చేశారు. జగన్‌పై రూ.వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు.

తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు బయటి నుంచి వచ్చారని..  అలా వచ్చిన అనేక మందికి కరోనా వైరస్‌ సోకిందన్నారు. పోలింగ్‌, ఫలితానికి మధ్య ఇన్ని రోజుల వ్యత్యాసమెందుకు? అని చింతామోహన్‌  ప్రశ్నించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని