భట్టి విక్రమార్కతో ఈటల భేటీ
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భట్టి విక్రమార్కతో ఈటల భేటీ

హైదరాబాద్‌: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో భట్టి నివాసానికి వెళ్లి ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై భట్టి విక్రమార్కతో ఈటల చర్చిస్తున్నట్లు సమాచారం. ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించిన ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో పలువురు ముఖ్యులను కలిసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్కతో ఈటల సమావేశమైనట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని