Ap News: పరిస్థితులు చక్కబడ్డాకే పరీక్షలు
close

తాజా వార్తలు

Updated : 08/06/2021 15:49 IST

Ap News: పరిస్థితులు చక్కబడ్డాకే పరీక్షలు

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చక్కబడ్డాకే పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తున్నాయని.. అలాగని ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. అలాగైతే ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా?అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా ఉద్దృతి నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని