తిరుపతి ఉపఎన్నిక.. గెలిచేదెవరో: ఎగ్జిట్‌పోల్‌

తాజా వార్తలు

Updated : 01/05/2021 07:13 IST

తిరుపతి ఉపఎన్నిక.. గెలిచేదెవరో: ఎగ్జిట్‌పోల్‌

అమరావతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నిక ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ఎన్నిక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ఆరా సంస్థ విడుదల చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి (ఎస్సీ) ఎంపీగా ఎన్నికైన బల్లి దుర్గాప్రసాదరావు గత సంవత్సరం సెప్టెంబరు 16న కరోనాతో మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ మేరకు అక్కడ నిర్వహించిన ఉప ఎన్నికలో అధికార వైకాపా 65.85 శాతం ఓట్లు దక్కించుకున్నట్లు ఆరా సంస్థ అంచనా వేసింది. తెదేపాకు 23.10 శాతం ఓట్లు, భాజపాకు 7.34 శాతం, ఇతరులకు 3.71 శాతం ఓట్లు వచ్చినట్లు అంచనా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని