AP news: ఎంపీ మాగుంటపై తప్పుడు కేసు పెట్టించారు: సోమిరెడ్డి

తాజా వార్తలు

Published : 05/08/2021 16:10 IST

AP news: ఎంపీ మాగుంటపై తప్పుడు కేసు పెట్టించారు: సోమిరెడ్డి

నెల్లూరు: అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎంపీ శ్రీనివాసులపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తప్పుడు కేసు పెట్టించారని తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆరోపించారు. ‘‘కాకాణి అనుచరులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేసి సర్వేపల్లి రిజర్వాయర్ గ్రానైట్‌ తవ్వకానికి అక్రమ దరఖాస్తు పెట్టుకున్నారు.  దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మాగుంటను కేసులో ఇరికించారు. దరఖాస్తు పెట్టింది మాగుంటే అయితే దీనిపై  పోలీసులు విచారణ ఎందుకు చేయలేదు? ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి పోలీసు, జలవనరుల అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని