‘మంచి రోజులంటే ఇవేనా?’ : మండిపడ్డ శివసేన

తాజా వార్తలు

Published : 22/02/2021 17:12 IST

‘మంచి రోజులంటే ఇవేనా?’ : మండిపడ్డ శివసేన

ముంబయి: పెరుగుతున్న ఇంధన, గ్యాస్‌ ధరల విషయంలో కేంద్రం తీరుపై శివసేన ఘాటు వ్యాఖ్యలు చేసింది. లీటరు పెట్రోలు ధర రూ.100 దాటించిన కేంద్రం అందుకు కాంగ్రెస్‌దే బాధ్యతగా అంటూ నిందలు మోపుతోందని పేర్కొంటూ శివసేన తమ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్‌ హయాంలో.. పెట్రోలియం పంపిణీ సహా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేస్తే, మోదీ ప్రభుత్వం వాటిని విక్రయించేస్తోందని మండిపడింది. ఇంధన ధరల పెంపు వల్ల అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పేర్కొంది. ఎవరైనా మోదీని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని సామ్నా ఆరోపించింది.

మరోవైపు ముంబయిలోని ప్రధాన కూడళ్లు, పెట్రోల్‌ బంకుల వద్ద ప్రధాని చెప్పిన ‘మంచి రోజులు’ ఇవేనా అంటూ శివసేన పోస్టర్లను ఏర్పాటు చేసింది. 2015 ఏడాదికి, 2021 నాటికి గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని ఈ పోస్టర్లలో శివసేన వివరించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని