‘అధికారమంటే ఏంటో చూపించారు’.. గడ్కరీపై పవార్‌ ప్రశంసలు

తాజా వార్తలు

Updated : 03/10/2021 09:55 IST

‘అధికారమంటే ఏంటో చూపించారు’.. గడ్కరీపై పవార్‌ ప్రశంసలు

పుణె: కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ ప్రశంసలు గుప్పించారు. అధికారాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి పనులు ఎలా చేయాలో ఆయన చేసి చూపించారని కొనియాడారు. ఈ మేరకు అహ్మద్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో గడ్కరీతో వేదిక పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గడ్కరీని ప్రశంసల్లో ముంచెత్తారు.

అహ్మద్‌నగర్‌లో సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను గడ్కరీ త్వరలో ప్రారంభించబోతున్నారని తెలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యానని పవార్‌ తెలిపారు. ప్రజాప్రతినిధి తన అధికారాన్ని దేశాభివృద్ధికి ఎలా ఉపయోగించాలో గడ్కరీ నిరూపించారని కొనియాడారు. గడ్కరీ రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి 5000 కిలోమీటర్ల మేర పనులు పూర్తవ్వగా.. ఆ తర్వాత ఆ సంఖ్య 12వేల కిలోమీటర్లకు చేరిందని చెప్పారు. చెరకు రైతులు తమ పంటను కేవలం చక్కెర తయారీకే కాకుండా ఇథనాల్‌ ఉత్పత్తికి ముడిసరకుగా కూడా వినియోగించొచ్చన్న దిశగా ఆలోచన చేయాలని పవార్‌ సూచించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని