Geeta Reddy : కేటాయించినవే ఖర్చు చేయలేదు.. లక్షల కోట్లంటే ఎలా నమ్మాలి?

తాజా వార్తలు

Updated : 31/07/2021 14:47 IST

Geeta Reddy : కేటాయించినవే ఖర్చు చేయలేదు.. లక్షల కోట్లంటే ఎలా నమ్మాలి?

కేసీఆర్‌ దళితుల్ని మోసం చేస్తున్నారు :గీతారెడ్డి

హైదరాబాద్‌ : దళితబంధు పేరుపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల్ని మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి ఆరోపించారు. దళితులకు కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని అన్నారు. తెలంగాణకు దళిత సీఎం అని చెప్పి కేసీఆర్‌ మాట తప్పారని విమర్శించారు.రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి బర్తరఫ్‌ ఎందుకు చేశారో చెప్పలేదని నిలదీశారు. గాంధీభవన్‌లో గీతారెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ మారుస్తా అని చెప్పి మార్చలేదు.ఏడేళ్లుగా రూ.85వేల కోట్లు కేటాయించి.. రూ.47వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ.38వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి పోయాయో ఎవ్వరికీ తెలియదు. దళితులకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులే పూర్తిగా ఖర్చు చేయని కేసీఆర్.. లక్షల కోట్లు పెడుతా అంటే ఎలా నమ్మాలి?ఎస్సీలకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం తెచ్చిన జీవోలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. దళితులకు భూపంపిణీ ప్రతిష్ఠాత్మక పథకం అన్నారు. మూడెకరాల లబ్ధి కోసం 3లక్షల కుటుంబాలు ఉంటే.. 6,662 కుటుంబాలకు 16వేల ఎకరాలు మాత్రమే ఇచ్చారు’ అని గీతారెడ్డి అన్నారు.

‘అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌లో కనీస స్టాఫ్‌ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా అంబేడ్కర్‌కు పూలమాల వేశారా?దళితబంధు పథకం అమలుకు మాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్రం అంతటా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల కోసమే హుజూరాబాద్‌లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలు అని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. హుజూరాబాద్‌లో దళితులు తెరాసకు ఓట్లు వెయ్యకపోతే.. రాష్ట్రం అంతటా అమలు చేయమని దళితుల్ని కేసీఆర్ బెదిరిస్తున్నారు’ అని గీతారెడ్డి అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని