వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

తాజా వార్తలు

Published : 04/01/2020 00:44 IST

వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

దిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఏడుగురు భాజపా అభ్యర్ధులు?

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎందుకలా ట్వీట్‌ చేసిందంటే...

దిల్లీ: ‘ఏడుగురు భారతీయ జనతా పార్టీ (భాజపా) ముఖ్యమంత్రి అభ్యర్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..’ అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్వీట్‌ చేసి ఆ పార్టీపై విమర్శలు గుప్పించింది. ఏడుగురు భాజపా దిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థులైన గౌతమ్‌ గంభీర్‌, మనోజ్‌ తివారీ, విజయ్‌ గోయల్‌, హర్దీప్‌ సింగ్‌ పూరీ, హర్షవర్ధన్‌, విజేందర్‌ గుప్తా, పర్వేష్‌ సింగ్‌లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఉన్న ఒక పోస్టర్‌ను తమ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఆపై.. అరవింద్‌ కేజ్రీవాల్‌పై పోటీ చేసేదెవరు అనేదే అసలు ప్రశ్న.. అంటూ పేర్కొంది. 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్‌ఆద్మీ పార్టీ, భాజపాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసలు భాజపాలో సరైన ముఖ్యమంత్రి అభ్యర్థే లేరంటూ ఆప్‌ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో ఏడుగురు భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థులకు శుభాకాంక్షలు అంటూ వారి పేర్లతో ఉన్న పోస్టర్‌ ఒకటి దిల్లీలో దర్శనమిచ్చింది. ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీ దీనిని ఉపయోగించుకుని వ్యంగ్య వ్యాఖ్యలు జోడిస్తూ ఆ పోస్టర్‌ను తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పెట్టింది. అయితే ఆ పోస్టర్‌ ఎక్కడ ఉన్నది మాత్రం వెల్లడించలేదు. కాగా దిల్లీ భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ అయిన కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తమ పార్టీ  ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందంటూ తెలిపారు.

 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని