జగన్‌ నివాసం బినామీ పేరుతో కట్టిందే: వర్ల

తాజా వార్తలు

Published : 03/01/2020 22:36 IST

జగన్‌ నివాసం బినామీ పేరుతో కట్టిందే: వర్ల

విజయవాడ: తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారిక నివాసం బినామీల పేరుతో కట్టారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. జగన్‌ కష్టార్జితంతో ఆ ఇల్లు కట్టారని వైకాపా నేతలు చెప్పగలరా? అని ఆయన నిలదీశారు. ఇంటి మరమ్మతుల కోసం రూ.42కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ.. అలాంటి వాళ్లా.. అవినీతి నిరోధక శాఖను మందలించేది? అని వర్ల ప్రశ్నించారు. ప్రభుత్వాధికారులు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్‌లో న్యాయస్థానంలో నిల్చోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

విజయవాడలో మీడియాతో వర్ల  మాట్లాడుతూ.. సరస్వతి పవర్‌ ప్రాజెక్టు కోసం రూ.5వేల కోట్లు విలువ చేసే 1500 ఎకరాల భూమిని అప్పటి వైఎస్‌ ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్‌ 109 ద్వారా 1500 ఎకరాలను తిరిగి సరస్వతి పవర్‌కు కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం మైనింగ్‌ శాఖలో ముఖ్యమంత్రి, ఆయన బంధువుల ఫైల్స్‌ మాత్రమే క్లియర్‌ అవుతున్నాయని ఆక్షేపించారు. కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి జీవోలు ఇచ్చే జగన్‌కు రాజధానిని తరలించే హక్కు ఎవరిచ్చారని వర్ల నిలదీశారు. రాజధాని తరలింపుపై వేసిన కమిటీల నివేదిక రాకముందే వారెలా ప్రకటన చేస్తారని వర్ల రామయ్య నిలదీశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని