పురపాలక రిజర్వేషన్ల గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

తాజా వార్తలు

Published : 05/01/2020 23:24 IST

పురపాలక రిజర్వేషన్ల గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

హైదరాబాద్‌: మరికొన్ని రోజుల్లో జరగనున్న పురపాలక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి 7, 8 ఉత్తర్వులను పురపాలకశాఖ విడుదల చేసింది. ఇప్పటికే వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. 120 పురపాలక సంఘాలు, 10 నగర పాలక సంస్థలకు జరగనున్న ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వార్డులను రాష్ట్ర పురపాలక శాఖ ఖరారు చేసింది. బీసీలకు 29.40 శాతం రిజర్వేషన్లు దక్కగా, ఎస్టీలకు 5.83, ఎస్సీలకు 14.15 శాతం దక్కాయి. ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుండగా, 22న ఎన్నికలు, 24న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని