తెలంగాణలో ‘పుర’ నోటిఫికేషన్‌ విడుదల

తాజా వార్తలు

Updated : 07/01/2020 21:54 IST

తెలంగాణలో ‘పుర’ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే షెడ్యూల్‌ ప్రకటించారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. షెడ్యూల్‌ ప్రకారం యథాతథంగా మున్సిపల్‌ ఎన్నికల నిర్వహిస్తామని తెలిపారు. నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ఆయన ప్రకటించారు. కరీంనగర్‌ మినహా రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 పురపాలికల్లోని 325 కార్పొరేటర్‌, 2,727 కౌన్సిలర్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

వివరణ అందాకే కరీంనగర్‌లో ఎన్నికలు..

జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితా, తుది జాబితాకు తేడా ఉన్నందునే కరీంనగర్‌ కార్పొరేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేయలేదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. దీనివల్ల రిజర్వేషన్లలో ఏమైనా తేడాలుంటాయా లేదా అనే అంశంపై పురపాలక శాఖను వివరణ కోరినట్లు చెప్పారు. పురపాలకశాఖ వివరణ ఇస్తే అర్ధరాత్రిలోపు నోటిఫికేషన్ విడుదల చేసి కరీంనగర్‌కూ ఇదే షెడ్యూల్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక తేదీని తర్వాత ప్రకటిస్తామని నాగిరెడ్డి వెల్లడించారు.

ముఖ్యమైన తేదీలు

నామినేషన్ల స్వీకరణ- జనవరి 8 నుంచి 10

నామినేషన్ల పరిశీలన- జనవరి 11

నామినేషన్ల ఉపసంహరణ గడువు- జనవరి 14

పోలింగ్‌ - జనవరి 22

ఓట్ల లెక్కింపు- జనవరి 25


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని